సాధారణంగా యువత అనగానే చదువు, ఒక మంచి సంస్థలో ఉద్యోగం, ఇళ్లు, బైక్, తదితర అంశాలతో విలాసవంతమైన జీవితాన్ని గడపాలని అనుక్షణం పరుగులు పెడుతూండటం చూస్తూనే ఉండి ఉంటాం. కానీ ఇటీవల ఈ పోకడలో కాస్త మార్పు వస్తుందనే చెప్పాలి. ముఖ్యంగా వ్యవసాయం వైపు యువత వెళ్ళడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా తమ ఉద్యోగాలను వదిలిపెట్టి మరి ఈ దారి పట్టడం స్వాగతించదగ్గ విషయం. ఈ పరిణామాలు కేవలం కరోనా వలన వచ్చినవా అంటే కాదు, దానికంటే ముందే కొందరు సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేశారు. వారిని చుసిన ఇంకొందరు అదే బాటలో నడవాలని భావిస్తున్నారు.


ఈ నేపథ్యంలోనే కరోనా వలన సేంద్రియ వ్యవసాయం ప్రాముఖ్యత మరింతగా తెలిసివచ్చింది అందరికి. దానితో మరికొంత మంది యువత సరదాగా లాక్ డౌన్ సహా వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఈ తరహా వ్యవసాయం చేస్తూ మెల్లిగా దానిలో ఉన్న అద్భుతాలను గ్రహించిన వారై, అటువైపు మళ్లుతున్నారు. అలా అస్సాం లో నబనితా దాస్ తన ఉద్యోగం వదిలి వ్యవసాయానికి అంకితం అయ్యింది. ప్రస్తుతం ఆమె సేంద్రియ వ్యవసాయం చేస్తూ అందరికి ఆదర్శంగా నిలిచింది. ప్రభుత్వ అసిస్టెంట్ నర్స్ గా ఉద్యోగం వచ్చినప్పటికీ అందులో తృప్తి లేక నాలుగేళ్లకే దానిని వదిలేసి వ్యవసాయం వైపు అడుగులు వేసింది.

ముందుగా తాను సేంద్రియ వ్యవసాయం లో తర్ఫీదు పొంది అనంతరం సొంతగా వ్యవసాయం చేస్తుంది. ఒక్క వ్యవసాయంతో ఆగకుండా, కాస్త ప్రత్యేకంగా ఆలోచిస్తూ, చేపల పెంపకం, పశుపోషణ కూడా చేయడం ఆరంభించింది. వ్యవసాయంలో ముందుగా కూరగాయలతో ప్రారంభించిన ఆమె అనంతరం పండ్ల మొక్కలను కూడా పెంచడం ఆరంభించింది. తాను చేసేది సాంప్రదాయ వ్యవసాయం కావడంతో గిరాకీ కూడా బాగానే పలికేది. ఆరోగ్యం మీద తాజాగా అందరికి మక్కువ పెరిగింది కాబట్టి సేంద్రియ ఉత్పత్తులవైపు మళ్లుతున్న విషయం తెల్సిందే. దీనితో ఆమె ఉత్పత్తులు కూడా అలా మార్కెట్ లోకి రాగానే ఇలా అమ్ముడు అయిపోతున్నాయి. ఊరికే వ్యవసాయం చేస్తూ ఉండలేదు, ఆమె శ్రమను గుర్తించారు, ఎందుకంటే ఆమె తన కుఉన్న భూమిలోనే వ్యవసాయ క్షేత్రం చేసి, అందులోనే కూరగాయలు, పండ్లు, పూలు, పప్పుగింజలు నూనె గింజలు సాగుచేయడం అందరిని ఆకర్షించింది. అలాగే వివిధ జాతుల కోళ్లు, పావురాలు, బాతులు, దేశీయ విదేశీ జాతులను పెంచసాగింది. ఎంతో అరుదుగా కనిపించే కడక్ నాధ్ సహా ఆమె ఫామ్ లో అనేక కోళ్లు కనిపిస్తాయి.

ఆమె కృషికి అనేక అవార్డులు కూడా వచ్చాయి. నేటి యువ రైతులు కూడా అనేక మందికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. యువత ఇలా వ్యవసాయాన్ని కూడా తమ వృత్తిగా గౌరవంగా ఎంచుకోవడం ఎంతో గొప్ప విషయం. ఈ పరిణామం భారతదేశానికి కూడా మేలు చేస్తుంది. అందరికి ఉద్యోగాలు కావాలంటే ఇలాంటి దారులు స్వయంగా వేసుకోవడం ఎంతో అవసరం.

మరింత సమాచారం తెలుసుకోండి: