ఒక మనిషిని స్నేహితుడిగా మలుచుకోవడం కంటే శత్రువుగా మార్చుకోవడం చాలా తేలికైన పని. వయస్సు పెరుగుతున్న కొద్దీ , వ్యక్తిత్వాలు సంక్లిష్టం అవుతున్న కొద్దీ ఆ కష్టం కాస్త అసాధ్యం గా మారిపోతుంది. అలాంటి ప్రయత్నానికి తోడుగా ఒక బుక్ ఉంది. దాని పేరే "స్నేహితులను సంపాదించడం మరియు వ్యక్తులను ప్రభావితం చేయటం ఎలా ", దీని రచయిత డేల్ కార్నేగి.

ఈ పుస్తకం లోని కొన్ని విషయాలను చూద్దాం రండి
1. అహంకారం తేనె పట్టులాంటిది. దాన్ని రెచ్చగొట్టకుండా , లోపల ఉన్న
స్నేహ మధుర్యాన్ని అందుకోవాలి. ఈ పుస్తకంలోని మొదటి అధ్యాయం సారాంశం ఇదే. కఠినమైన విమర్శలు, అర్థంలేని ఆరోపణలతో అహం దెబ్బతింటుంది. అందుకే ప్రతికూలమైన విషయాలను సున్నితంగా , పరోక్షంగా తెలియజేయలి.
2. అవతలి వారు మనల్ని గుర్తించాలని అనుకుంటాం. ఎదుటివారు మన నుంచి అంతే ప్రాధాన్యాన్ని కోరుకుంటారు! అందుకే స్నేహితుడిని ఎప్పుడూ చులకన చేయొద్దు, అతడి స్నేహాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. మిత్రుడిని గౌరవిద్దాం!
3. " నిన్ను చూస్తే చాలా సంతోషమేస్తుంది.నీ ఉనికి నాకు కొండంత బలం" ఇవన్నీ మాటల్లో చెప్పేందుకు మొహమాటం అడ్డు వస్తుంది కదా! కానీ ఇదే విషయాన్ని ఓ చిన్న చిరునవ్వు వెల్లడిస్తుంది. నేస్తాన్ని చూస్తూనే పసిపాపలా నిష్కల్మషంగా నవ్వే నవ్వు , బంధాన్ని దృఢ పరుస్తోంది.
4. ఒకరికి పుస్తకాలంటే పిచ్చి , మరొకరికి పాటలంటే ప్రాణం కానీ వారి
స్నేహ బృందం లో ఎవరు కళల ఊసే ఎత్తరు. అంతదాకా ఎందుకు? మీకు మాత్రం మీ ప్రాణ స్నేహితుడి అభిరుచులు ఏమిటో తెలుసా! తెలిసినా, ఆ ఇష్టం గురించి ఎప్పుడైనా మాట్లాడే ప్రయత్నం చేశారా ? ఓసారి ఆ ప్రస్తావన తీసుకురండి. వాళ్ళ హావభావాల్లో వచ్చే మార్పునీ , మాటల్లో ఉద్వేగాన్నీ గమనించండి.
5.
ప్రతి ఒక్కరూ తనకు తానుగా నిర్ణయిస్తారు. ఏ వ్యక్తికి, కొంత నాణ్యత చాలా ముఖ్యమైనది, మరికొన్ని తక్కువ. తరచూ కష్ట పరిస్థితుల్లో మాత్రమే ఒక వ్యక్తి తనను తాను పూర్తిగా బయట పెట్టినందున, అనుభవించిన దురదృష్టాలు లేదా వైఫల్యాల తర్వాత మాత్రమే, నిజమైన స్నేహితుడు అయిన వ్యక్తిని మీరు అర్థం చేసుకుంటారు.