సొరకాయ అనేది చాలా హైడ్రిటేడ్ కూరగాయ. ఇది మన ఇండియాలో ఎక్కడైనా సరే పెరుగుతుంది. ఇది శరీరానికి అనేక ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది. సొరకాయ దాదాపుగా 96 శాతం మొత్తం నీటితో నింపబడి ఉంటుంది. అందుచేతనే ఇది తగినంత హైడ్రేషన్ అందిస్తుంది. తద్వారా మన శరీరానికి చల్లదనాన్ని కూడా అందిస్తుంది. సొరకాయలు విటమిన్లు, నీటి శాంతం, ఫైబర్ వంటివి చాలా పుష్కలంగా లభిస్తాయి. అందుచేతనే మన గుండెను రక్షించడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి, రక్తపోటు సమస్య ఇబ్బంది పడే వారు వీటిని తినడం మంచిది. ఇక వీటితో మరి కొన్ని ప్రయోజనాలు తెలుసుకుందాం.

1). ప్రస్తుతం ఎండలు ప్రారంభం అయ్యాయి కావున ఈ సమయంలో శరీర ఉష్ణోగ్రత చాలా పెరిగిపోతుంది. ఈ వేడి గాలి వల్ల అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా మన శరీరానికి హైడ్రేషన్ సరఫరా చాలా అవసరం. కేవలం అవి తాగే నీటితోనే రావడం కష్టం. అందుచేతనే మీరు జ్యూస్ కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి అందులో సొరకాయ కూడా చాలా మంచిది.

2). గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి గుమ్మడికాయ కూడా చాలా ఉపయోగపడుతుంది అందులో ఉండే ఉప్పు, పొటాషియం, ముఖ్యమైన ఖనిజాలు వల్ల గుండె జబ్బు నుండి మనల్ని రక్షిస్తూ ఉంటుంది. గుమ్మడి కాయని అప్పుడప్పుడూ తింటూ ఉంటే సమతుల్య రక్తప్రవాహాన్ని జరిగేలా చేస్తుంది.

4). మలబద్దక సమస్యతో బాధపడుతున్నవారు ఫైబర్ మరియు నీరు పుష్కలంగా ఉండే ఆహారం తినడం వల్ల అవి తేలికగా జీర్ణం అవుతుంది. అంతేకాక మలబద్ధకం వల్ల అసిడిటీ, కడుపు ఉబ్బరం వంటివి తగ్గించడంలో కూడా ఈ సొరకాయ జ్యూస్ చాలా ఉపయోగపడుతుంది.

5). ఎవరైతే ఎక్కువగా బరువు తగ్గాలనుకుంటున్నారో.. వారు వీటిని వారంలో కనీసం రెండు సార్లు అయినా జ్యూస్ చేసుకొని తాగడం వల్ల కేవలం మూడు నెలల్లోనే మీరు బరువు తగ్గే అవకాశం ఉంటుంది. ఇక అంతే కాకుండా ఈ ఎండ నుండి మనల్ని రక్షిస్తుంది కూడా.

మరింత సమాచారం తెలుసుకోండి: