
ప్రస్తుత కాలంలో మారుతున్న వాతావరణ జీవనశైలి కారణంగా పిల్లలలో ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువగా ఉంటుంది. ఏ చిన్న సమస్య వచ్చినా సరే వారు ఆ సమస్యను ఎదుర్కోలేకపోతున్నారు. అందుకే పెద్దలు పిల్లలకు పెట్టే ఫుడ్డు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా వారిని ఆరోగ్యంగా ఉంచే ఆహారాలను మాత్రమే వారికి అందివ్వాలట.. ఇక ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం పిల్లలకు ఉదయం పూట కొన్ని రకాల ఆహారాలను పెడితే తప్పకుండా వారు ఆరోగ్యంగా మారుతారని జలుబు , జ్వరం వంటి సమస్యలను ఎదుర్కోగలరు అని చెబుతున్నారు. పిల్లలు రోగనిరోధక శక్తి పెరగాలంటే ఎలాంటి పోషకాలను ఆహారాన్ని అందివ్వాలి అనే విషయం ఇప్పుడు చూద్దాం..
ఓట్స్:
సాధారణంగా ఓట్స్ లో ఎన్నో రకాల పోషకాలు అందుబాటులో ఉంటాయి. వీటిని తింటే అధిక బరువు, ఊబకాయం వంటి సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు. కాబట్టి పిల్లలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అందుకే ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ లో వారికి తప్పకుండా ఓట్స్ తినిపించాలి. ఓట్స్తోపాటు చెర్రీలు, అరటి పండ్లు , పాలు, స్ట్రాబెర్రీలు, బాదం, పిస్తా , కొంచెం కోకో పౌడర్, తేనే వేసి ఒక టేస్టీ రెసిపీ తయారు చేసి పిల్లలకు అందించవచ్చు. ఒకవేళ ఫ్రూట్స్ పిల్లలు తినకపోతే ఓట్స్ దోశ లేదా ఓట్స్ తో ఇడ్లీ , ఉప్మా లాంటివి చేసి పెట్టవచ్చు.
అలాగే గుడ్డు పోషకాలం నిధి.. గుడ్డును ఉదయం పూట తినడం వల్ల మీ పిల్లలు రోజంతా చాలా ఎనర్జిటిక్ గా తయారవుతారు. గుడ్లల్లో ఉండే ప్రోటీన్లు పిల్లలను కండరాలు కణజాలాల పెరుగుదలకు చాలా సహాయపడతాయి. అలాగే వారి ఆరోగ్యాన్ని పెంచే ఆకుకూరలు కూడా ఇవ్వాలి. బచ్చలి కూర క్యాప్సికం, క్యాబేజీ వంటి ఆకుపచ్చ కూరలను వేయించి పిల్లలకు ఇవ్వడం వల్ల వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. వీటితోపాటు సీజనల్గా వచ్చే అన్ని రకాల పండ్లను పిల్లలకు తినిపించాలి. ఇలా చేసినట్లయితే పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరిగి వారు దృఢంగా, ఆరోగ్యంగా తయారవుతారు.