ఇటీవల కాలంలో గడ్డం పెంచుకోవడం అనేది.. ఒక ట్రెండ్ గా కొనసాగుతూ ఉంది అని చెప్పాలి. ఈ ట్రెండును నేటి రోజుల్లో యువకులందరూ కూడా బాగా ఫాలో అవుతున్నారు. కేవలం యువకులు మాత్రమే కాదండోయ్ మిడిల్ ఏజ్ లో ఉన్న వారు సైతం అటు గడ్డం భారీగా పెంచుకొని దానికి ఒక స్టైలిష్ లుక్ లో హీరో లాగా ముస్తాబ్ అవుతున్నారు అని చెప్పాలి.


 ఇలా నేటి రోజుల్లో ఎవరికి నచ్చిన విధంగా వారు గడ్డం ట్రిమ్ చేసుకొని అల్ట్రా స్టైలిష్ గా కనిపించడం కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఇక పెళ్లి సమయంలో కూడా గడ్డం తీయడానికి ఎవరు ఇష్టపడటం లేదు. ఒకప్పుడు పెళ్లి జరుగుతుంది అంటే చాలు అప్పటి వరకు గడ్డం ఎంత పెంచుకున్న.. క్లీన్ షేవ్ చేసుకుని పెళ్లి చేసుకోవడం చేసేవారు.  కానీ నేటి రోజుల్లో మాత్రం ఇక గడ్డం అలాగే ఉంచుకొని పెళ్లిళ్లు చేసుకోవడం లాంటివి చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇది ఒక ట్రెండ్గా కూడా మారిపోయింది. కానీ ఇలా గడ్డం ట్రెండ్ గా భావించే కొంతమంది యువకులకు ఇక్కడ షాక్ తగిలింది.


 ఒకవేళ గడ్డం తీసేసి క్లీన్ షేవ్ చేసుకోకపోతే పెళ్లి క్యాన్సిల్ అయ్యే పరిస్థితి వచ్చింది అని చెప్పాలి. జైపూర్ కు చెందిన శ్రీ క్షత్రియ కుమావత్ సామూహిక వివాహ సమితి కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 30వ తేదీన ఈ కమిటీ సామూహిక వివాహాలు చేసేందుకు నిర్ణయించింది అని చెప్పాలి. కాగా ఇక ఈ సామూహిక వివాహాలలో పాల్గొనే పెళ్ళికొడుకులందరూ కూడా తప్పనిసరిగా క్లీన్ షేవ్ చేసుకోవాలి అనే నిబంధన పెట్టింది. ఇదే భారతీయ సంస్కృతి అని చెప్పింది సదరు కమిటీ. దీంతో గడ్డం అంటే ఇష్టం ఉన్నా.. తప్పనిసరిగా క్లీన్ షేవ్ చేసుకోవాల్సిన పరిస్థితి పెళ్ళికొడుకులకు వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: