మెంతికూరతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ?

మనం మెంతికూరను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల కోట్లలో లాభాలు పొందవచ్చు. దీనివల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. కంటిచూపు బాగా మెరుగుపడుతుంది. అలాగే బాలింతలు ఈ మెంతికూరను తీసుకోవడం వల్ల వారిలో పాల ఉత్పత్తి పెరుగుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఈజీగా తగ్గుతాయి. గుండె ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు ఏమీ రాకుండా ఉంటాయి. జుట్టు ఖచ్చితంగా పొడవుగా పెరుగుతుంది. నోటిపూత, నోటిలో అల్సర్ వంటి సమస్యలతో బాధపడే వారు ఈ మెంతికూరను తినడం వల్ల ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుంది. ఈ మెంతికూరతో మనం పప్పు, పరోటా, టమాట మెంతికూర ఇలా రకరకాల వంటకాలను తయారు చేసుకుని కూడా తినవచ్చు. ఈ విధంగా ఏదో ఒక రూపంలో మెంతికూరను  తీసుకోవడం వల్ల మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.


100గ్రాముల మెంతికూరలో మొత్తం 86.5 గ్రాముల నీటిశాతం ఉంటుంది. ఇంకా అలాగే 34 కిలో క్యాలరీల శక్తి, 2 గ్రాముల పిండి పదార్థాలు, 4 గ్రాముల ప్రోటీన్, 0.8 గ్రాముల ఫ్యాట్, 5 గ్రాముల పీచు పదార్థాలు ఉంటాయి.ఇంకా అదే విధంగా 5.6 మిల్లీ గ్రాముల ఐరన్, 396 మిల్లీ గ్రాముల క్యాల్షియం, 58 మిల్లీ గ్రాముల విటమిన్ సి, 75 మైక్రో గ్రాముల ఫోలిక్ యాసిడ్, 428 మైక్రో గ్రాముల విటమిన్ కె, 9,245 మైక్రో గ్రాముల బీటా కెరోటిన్, 63.6 మిల్లీ గ్రాముల మెగ్నీషియం అనేది ఉంటుంది. ఇతర ఆకుకూరల కంటే మెంతికూరలో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మెంతికూరను తీసుకోవడం వల్ల ఇన్సులిన్ నిరోధకత కూడా తగ్గుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు ఈజీగా అదుపులో ఉంటాయి. షుగర్ వ్యాధితో బాధపడే వారు మెంతికూరను తీసుకోవడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: