కొంతమంది మొఖం పని ఒత్తిడి,సన్ టాన్,జిడ్డు కారడం వల్ల ఎంత శుభ్రం చేసుకున్న అలసటగా అనిపిస్తూ ఉంటుంది.ఇలాంటి వారు బ్యూటిపార్లల్ కీ వెళ్ళి ఎంత ఖర్చుతో కూడిన ఫేషియల్ చేయించుకున్న సరే అప్పటికప్పుడు మొఖం మెరుగ్గా వున్నా,మరుసటి రోజుకే అలసట ఉట్టి పడుతూ ఉంటుంది.మరీ ముఖ్యంగా ఎలక్ట్రిక్ గాడ్జెట్స్ ని ఉపయోగించే వారికి బ్లూ లైట్ ముఖంపై పడి మరింత నిర్జీవత్వాన్ని యాడ్ చేస్తూ ఉంటుంది.ఇలాంటి వారికి ఇంట్లో తయారు చేసుకునే సింపుల్ చిట్కాలు చాలా బాగా పనిచేస్తాయని డెర్మటాలజిస్ట్లో సైతం చెబుతున్నారు.మరి ఆ పదార్థాలు ఏంటో ఆ చిట్కాను ఎలా తయారు చేసుకోవాలో మనము తెలుసుకుందాం పదండి..

దీని కోసం ముందుగా ఒక బౌల్లో రెండు నుంచి మూడు స్పూన్ల పచ్చిపాలను తీసుకొని,ఇందులో ఒక స్పూన్ తేనె,ఒక స్పూను శెనగపిండి,చిటికెడు పసుపు వేసి బాగా మిక్స్ చేయాలి.ఈ చిట్కాను రోజూ రాత్రి పడుకోబోయే ముందు అప్లై చేసుకోవాలి.ఇది బాగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో మర్దన చేస్తూ శుభ్రం చేసుకుని మాయిశ్చరైసర్ రాసుకుంటే సరిపోతుంది.కానీ సెన్సిటివ్ స్కిన్ కలవారు మాత్రం పాల ప్లేసులో రోజ్ వాటర్ ని వేసి అప్లై చేసుకోవడం ఉత్తమం.మరియు జిడ్డు చర్మం కలవారు పాలను వాడుకునేందుకు బదులుగా పెరుగును వాడుకోవడం చాలా మంచిది.

పచ్చిపాలను వాడుకోవడం వల్ల ఇందులోనే ల్యాక్టో బ్యాసిల్లస్ అనే బ్యాక్టీరియా మన చర్మంపై మృత కణాలను తొలగించి నిర్జీవత్వానికి ఉపశమనం కలిగిస్తుంది.దీనితో మొఖం ఎప్పుడు చూసినా యాక్టీవ్ గా,బంగారు వర్ణంతో మెరిసిపోతూ ఉంటుంది.

దీనితో పాటు రోజూ ఫేసియల్ యోగా,వ్యాయామాలు చేయడం,3నుండి 4లీటర్ల నీటిని తీసుకోవడం,విటమిన్ సి మరియు విటమిన్ ఈ అధికంగా కలిగిన ఆహారాలు తీసుకోవడం,మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం వంటివి చేయడం వల్ల కూడా మన లేకుండా ముఖముపై అలసట లేకుండా  వెలిగిపోయేలా చేస్తాయి.కావున మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ చిట్కాని తప్పక ట్రై చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: