చలికాలం మొదలైంది అంటే చాలు చర్మ సమస్యలు, ఆరోగ్య సమస్యలే కాక జుట్టు సమస్యలు కూడా మొదలవుతాయి.ఈ ముఖ్యంగా ఈ సమయంలో జుట్టు ఎండుగడ్డల తయారవడం చుండ్రు ఎక్కువగా ఉండడం ఎక్కువగా ఊడిపోవడం వంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి.దీనికి కారణం సీజన్లో మార్పు కావడమే కాకుండా మనం తినే ఆహారంలో మార్పు వల్ల కూడా ఇలా జరుగుతూ ఉంటుంది.ఇలాంటి సమయంలో ఉసిరితో వేసుకొనే హెయర్ ప్యాక్ చాలా ఉపయోగపడుతుంది.అదేలానో తెలుసుకుందాం పదండీ..

సాధారణంగా చలికాలంలోనే ఉసిరి ఎక్కువగా లభిస్తుంది.ఇందులో విటమిన్ సి,పైటో న్యూట్రియంట్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కళంగా లభిస్తాయి.రక్త ప్రసరణ తలకు అవసరమైన అన్ని పోషకాలు మరియు ఆక్సిజన్‌ను అందేలా చేస్తాయి. దీనితో పాటు చర్మాంతర్గత రక్త ప్రవాహం జుట్టు యొక్క అనాజెన్ దశలో సహాయపడుతుంది.దీనిని తరుచూ ఉపయోగించడంతో వెంట్రుకలు పొడవుగా పెరుగుతాయి.విటమిన్ సి స్కాల్ప్‌పై ఉన్న రసాయన నిర్మాణాన్ని మరియు ధూళి పొరలను తొలగిస్తుంది. స్కాల్ప్ శుభ్రంగా ఉన్నప్పుడు,పోషకమైన జుట్టు ఉత్పత్తులను బాగా గ్రహించగలుగుతుంది.చుండ్రు కారణమైన బ్యాక్టిరియా తొందరగా నశిస్తుంది.

ఈ ప్యాక్ కోసం ఒక స్ఫూన్ ఉసిరి పొడి తీసుకొని, ఇందులో రెండు టేబుల్ స్ఫూన్ల పెరుగు,ఒక స్ఫూన్ నిమ్మరసం,ఒక స్ఫూన్ నానబెట్టిన మెంతులు వేసి బాగా మీక్సీ పట్టుకోవాలి.ఈ మిశ్రమాన్ని తలకు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసి అరగంట సేపు బాగా ఆరనివ్వాలి.ఇప్పుడు మైల్డ్ షాపూతో స్నానం చేస్తే చాలు.ఇలా వారానికి రెండు సార్లు చేయడంతో జుట్టుకు సరైన రక్త ప్రసరణ జరిగి,జుట్టు మెరుపును సంతరించుకుంటుంది.

కావున అధిక ఘాడత షాంపూ కూడా అవసరం లేదు.మరియు పెరుగుతో కలిపినప్పుడు ఇది జుట్టుకు కూడా కండిషన్ చేస్తుంది.ఉసిరి హెయిర్ ప్యాక్‌లు చుండ్రు మరియు ఇతర స్కాల్ప్ సమస్యలకు చికిత్స చేయడంలో చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది.కావున మీరు కూడా ఇలాంటి సమస్యతో బాధపడుతుంటే ఈ ప్యాక్ ని తప్పక వాడి చూడండి.ఈ ఉసిరి పొడి ప్యాక్ వేయడం వల్లే కాక, ఉసిరి కాయలు తినడంతో కూడా జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: