పింక్ సాల్ట్, ముఖ్యంగా హిమాలయన్ పింక్ సాల్ట్, రక్తపోటును నియంత్రించడానికి, ఎలక్ట్రోలైట్లను సమతుల్యం చేయడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు. పింక్ సాల్ట్ బరువు తగ్గడానికి సహాయపడవచ్చని చెప్పవచ్చు. అయితే పింక్ సాల్ట్ ఉపయోగాల గురించి మరిన్ని పరిశోధనలు అయితే జరగాల్సి ఉంది.

పింక్ సాల్ట్ లో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి ఖనిజాలు  ఉండగా ఈ ఖనిజాలు  రక్తపోటును నియంత్రించడంలో ఎంతగానో సహాయపడతాయి. అయితే, అధికంగా ఉప్పు తీసుకోవడం వల్ల రక్తపోటు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. పింక్ సాల్ట్ ను మితంగా తీసుకోవడం, రోజుకు 2,300 mg సోడియం తీసుకోవాలనే సిఫార్సును మించకుండా చూసుకోవడం ఎంతో  ముఖ్యం అని కచ్చితంగా చెప్పవచ్చు.

అధిక రక్తపోటుతో బాధపడుతుంటే, పింక్ సాల్ట్ ను మీ ఆహారంలో చేర్చడానికి ముందు మీ వైద్యుడిని సంప్రదించడం  మంచిది.  మీ రోజువారీ ఉప్పు వినియోగాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తే ఆరోగ్యానికి మేలు చేస్తుంది.  అధిక రక్తపోటును నియంత్రించడానికి ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం  ఎంతో  ముఖ్యమని చెప్పవచ్చు.

వ్యాయామం, సమతుల్య ఆహారం, తగినంత నిద్ర ఆరోగ్యానికి ఎంతో  అవసరమని చెప్పవచ్చు. పింక్ సాల్ట్ రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుందని అనేక అధ్యయనాలు  సూచిస్తుంది. షుగర్ ను సైతం కంట్రోల్ లో ఉంచడంలో పింక్ సాల్ట్ ఎంతగానో సహాయపడుతుంది.  హిమాలయ పర్వతాల్లో ఉండే సహా నిక్షేపాల నుంచి  ఈ హిమాలయన్ పింక్  ఉప్పును తయారు చేస్తారు.  




వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: