
ఇది కార్టిసాల్ అనే హార్మోన్‌ను విడుదల చేస్తుంది, అది గుండెపై ప్రభావం చూపిస్తుంది. ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, చక్కెరలు ఎక్కువగా ఉండే డ్రింకులు. ఫైబర్ లేని ఆహారం, డీప్ ఫ్రై చేసిన పదార్థాలు. ఇవి చెడు కొలెస్ట్రాల్ (LDL) పెరగడానికి దారితీస్తాయి. సిగరెట్ తాగడం వల్ల ఆర్టరీస్‌లో బ్లాక్‌లు ఏర్పడతాయి. ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు ఏర్పడతాయి. కుటుంబంలో ఎవరికైనా గుండె సంబంధిత వ్యాధులు ఉంటే, వారిలో ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కొన్ని జీన్స్ హార్ట్ ఎటాక్‌కు రిస్క్ పెంచుతాయి. నిద్ర తక్కువగా పడటం లేదా నిద్రలేమి మెటబాలిజం పై ప్రభావం చూపిస్తుంది.
దీనివల్ల హైబీపీ, డయాబెటిస్ వంటి వ్యాధులు వస్తాయి — ఇవి హార్ట్ ఎటాక్‌కు దారితీస్తాయి. బరువు అధికం, బీపీ, షుగర్, ట్రైగ్లిసరైడ్స్ పెరగడం వంటి సమస్యలు కలగడం. ఇది గుండె జబ్బుల రిస్క్‌ను బలంగా పెంచుతుంది. యువత ఎక్కువగా సెల్‌ఫోన్, టీవీ, ల్యాప్‌టాప్‌లకు బానిసలు కావడం. నడక లేకపోవడం, బైసికల్ తొక్కకపోవడం, బయట వ్యాయామం లేకపోవడం వల్ల కార్డియోవాస్కులర్ ఆరోగ్యం బలహీనమవుతుంది. యువతలో చాలామంది ప్రివెంటివ్ చెకప్స్ చేయించుకోవడం లేదు. కొలెస్ట్రాల్, షుగర్, బీపీ చెకప్ చేయకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ ముందుగానే గుర్తించలేరు. ప్రతి రోజు కనీసం 30 నిమిషాల ఫిజికల్ యాక్టివిటీ చేయండి. ధూమపానం మానేయండి, మద్యం తగ్గించండి. ఒత్తిడి తగ్గించుకోండి – యోగా, ధ్యానం, సంగీతం ద్వారా. ప్రతి సంవత్సరం చెకప్ చేయించుకోవడం అలవాటు చేసుకోండి.