రాగి పిండితో ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పిండిలో కాల్షియం, ఐరన్, ఫైబర్, ప్రోటీన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రాగులు త్వరగా జీర్ణమవుతాయి, అందుకే రాగి పిండితో చేసిన వంటలు సులభంగా అరిగిపోతాయి. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచి, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. రాగి పిండిని ఆహారంలో భాగంగా తీసుకుంటే శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది.

రాగుల్లో కాల్షియం అధికంగా ఉంటుంది కాబట్టి, ఎముకలు బలంగా ఉంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వయసు పైబడినవారు రాగి పిండితో చేసిన వంటలు తింటే ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే, ఇందులో ఉండే ఐరన్ రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది.

మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా రాగి పిండి చాలా మంచిది. ఇందులో ఉండే ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో తోడ్పడుతుంది. బరువు తగ్గాలనుకునేవారు రాగి పిండితో చేసిన వంటలు తింటే త్వరగా ఆకలి వేయదు, దీనివల్ల ఎక్కువ ఆహారం తినకుండా ఉంటారు. రాగి పిండితో జావ, అట్లు, రొట్టెలు, లడ్డూలు వంటి అనేక రకాల వంటలు చేసుకోవచ్చు. ప్రతిరోజూ రాగి పిండిని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందవచ్చు.

చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ రాగి పిండి మేలు చేస్తుందని చెప్పవచ్చు.  కాల్షియం లోపం ఉన్నవాళ్లకు సైతం ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టడంలో రాగులు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయపడతాయని కచ్చితంగా చెప్పవచ్చు. రాగి పిండి వల్ల ఆరోగ్యానికి లాభాలే తప్ప నష్టాలు లేవు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: