హిందూ పురాణాల ప్రకారం రాఖీ పండుగను ప్రతి భారతీయులు చాలా ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా తమ సోదరులకు రాఖీ కట్టి వారి రక్షణ, దీర్ఘాయుష్షు కోసం సోదరీమణులు ప్రార్థిస్తారు. ఈ రాఖీ పౌర్ణమి ఈసారి శనివారం వచ్చింది. రాఖీ పండుగ రోజున కొన్ని చేయవలసిన, చేయకూడని పనులను గుర్తించుకోవాలి వాటి గురించి చూద్దాం.


రాఖీని ముందుగా వినాయకుడు లేదా హనుమంతుడు శ్రీకృష్ణుడు వంటి దేవుళ్ళ విగ్రహాలకు కట్టడం చాలా మంచిది.ఆ తర్వాతే తమ సోదరులకు కట్టడం మంచిది.


శుభ ముహూర్తాన్ని పట్టించుకోకుండా రాఖీలు కట్టడం వంటివి చేయకూడదు. పంచాంగం లో సూచించిన శుభముహూర్తాన్ని మాత్రమే రాఖీలను కట్టాలి. అశుభ సమయాలలో కడితే తోబుట్టువుల మధ్య దూరం ఏర్పడుతుందని పండితులు తెలుపుతున్నారు.


ఏదైనా చిరిగినా లేదా నలుపు రంగు దుస్తులనే కాకుండా రాఖీలను మాత్రం అసలు ఉపయోగించకూడదు. ఇవి ప్రతికూల శక్తులను తీసుకువచ్చేలా చేస్తాయి. పసుపు ఎరుపు రంగులో  వాటిని ధరించడం శుభానికి చిహ్నంగా ఉంటాయి.

రాఖీ కట్టేటప్పుడు సోదరి ఖచ్చితంగా తల కప్పుకొని రాఖీ కట్టాలి.


బొట్టు పెట్టేటప్పుడు కేవలం కుంకుమను మాత్రమే ఉపయోగించాలి. మరే సింధూరాన్ని కూడా ఉపయోగించకూడదు. అలాగే అక్షింతలు(బియ్యం పగలకుండా) అనేవి పగలకుండా చూసుకోవాలి. అలా విరిగిన బియ్యాన్ని ఉపయోగిస్తే ఆశుభ్రంగా భావిస్తారు.


రాఖీ కట్టేటప్పుడు కచ్చితంగా రాఖీ కడుతున్న సోదరుడు దక్షిణ వైపుగా ఉండేలా చూసుకోవాలి.

సోదరుడికి హారతి ఇచ్చేటప్పుడు విరిగిన దీపాన్ని అసలు ఉపయోగించకూడదు. సోదరుడు రాఖీ కట్టిన చోటు నుంచి కదలకుండా తన సోదరికి ఏదైనా కానుక ఇవ్వ వచ్చు.

రాఖీ కట్టిన తర్వాత పెద్దలకు పాదాభివందనం చేయడం ముఖ్యము. అలాగే రాఖీ కట్టిన సోదరికి పాదాభివందనం చేయవచ్చు. ఒకవేళ సోదరుడు పెద్దవారు అయితే అతని కాళ్లకు సోదరి పాదాభివందనం చేయవచ్చు

ముఖ్యంగా రాఖీ పండుగ రోజున మద్యం సేవించడం, మాంసాహారం తినడం వంటివి చేయకూడదు.

మరింత సమాచారం తెలుసుకోండి: