
నిద్ర సరిగ్గా లేకపోతే మానసిక ఆరోగ్యం క్షీణించి ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు వస్తాయి. అందువల్ల ప్రతిరోజు రాత్రి కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోయేలా చూసుకోవాలి. రోజూ కొద్దిసేపు ధ్యానం, యోగా చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. ఇవి మనసును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడతాయి.
రోజువారీ వ్యాయామం చేయడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాయామం చేయడం వల్ల ఎండార్ఫిన్లు విడుదలయ్యి ఒత్తిడి, డిప్రెషన్‌ల నుంచి ఉపశమనం లభిస్తుంది. మనం తినే ఆహారం కూడా మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఎక్కువగా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రొటీన్లు ఉండేలా చూసుకోవాలి. పంచదార ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి.
స్నేహితులు, కుటుంబ సభ్యులతో సమయం గడపడం వల్ల ఒత్తిడి దూరమవుతుంది. మీ మనసులో ఉన్న భావాలను పంచుకోవడం వల్ల మనసు తేలికపడుతుంది. ప్రకృతిలో గడపడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. ఉదయం లేదా సాయంత్రం వేళల్లో బయట నడవడం, పార్కులో కూర్చోవడం వంటివి చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.
ఒకవేళ మీరు పైన చెప్పిన వాటిని పాటించినా ఫలితం లేకపోతే, వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా అవసరం. వైద్యులు ఇచ్చే సలహాలను, చికిత్సలను పాటించడం వల్ల మీరు త్వరగా కోలుకుంటారు. ఈ చిట్కాలను పాటించడం ద్వారా మీరు డిప్రెషన్, ఒత్తిడి నుంచి బయటపడి ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవితాన్ని గడపగలరు. ఈ సమస్యలను నిర్లక్ష్యం చేస్తే మాత్రం దీర్ఘకాలంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొనే ఛాన్స్ అయితే ఉంది.