నిద్రలేమి అనేది చాలా మందిని వేధించే ఒక సాధారణ సమస్య. ఇది మన శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సరైన నిద్ర లేకపోతే రోజంతా నీరసంగా, చిరాకుగా అనిపిస్తుంది. అయితే, కొన్ని సులభమైన చిట్కాలను పాటించడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ప్రతిరోజు ఒకే సమయానికి పడుకుని, ఒకే సమయానికి నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి.  వారాంతాల్లో కూడా ఇదే సమయాన్ని పాటించడానికి ప్రయత్నించాలి.

ఇలా చేయడం వల్ల మీ శరీరానికి ఒక అలవాటు ఏర్పడి, నిద్ర తొందరగా పడుతుంది. కెఫిన్ ఉన్న పానీయాలు నిద్రను దూరం చేస్తాయి. అందుకే రాత్రి పడుకునే ముందు కాఫీ, టీ, లేదా కోలా లాంటివి తాగడం  మానుకోవాలి.    పడుకునే గంట ముందు ఫోన్, ల్యాప్‌టాప్, టీవీ లాంటి వాటిని చూడటం ఆపేయాలి. ఈ స్క్రీన్స్ నుంచి వచ్చే బ్లూ రేస్ వల్ల మన శరీరానికి హాని కలిగే అవకాశాలు అయితే ఉంటాయి.

గోరువెచ్చని స్నానం చేయడం, ధ్యానం చేయడం, లేదా ఏదైనా పుస్తకం చదవడం లాంటివి చేయడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇది నిద్ర త్వరగా పట్టడానికి సహాయపడుతుంది. మనం నిద్రపోయే గది చల్లగా, చీకటిగా, ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. ప్రశాంతమైన నిద్రకు ఇది చాలా ముఖ్యమని చెప్పవచ్చు.

పగటిపూట ఎక్కువగా నిద్రపోవడం వల్ల రాత్రి నిద్ర పట్టడం కష్టం అవుతుంది. ఒకవేళ పడుకోవాలనుకుంటే 20-30 నిమిషాలకు మించి  నిద్రపోవడం మంచిది కాదు. రోజూ వ్యాయామం చేయడం వల్ల శరీరానికి అలసట వచ్చి నిద్ర బాగా పడుతుంది. అయితే, పడుకునే ముందు కఠినమైన వ్యాయామాలు చేయకూడదు. రాత్రిపూట తేలికైన ఆహారం తీసుకోవాలి. నిద్రపోయే ముందు భారీగా తినడం మానుకోవాలి. పాలకూర, బాదం, చేపలు లాంటివి ఆహారంలో చేర్చుకోవాలి . వీటిలో ఉండే పోషకాలు మంచి నిద్రకు సహాయపడతాయి


మరింత సమాచారం తెలుసుకోండి: