నగరాలు, గ్రామాలు అనే తేడాల్లేకుండా ఖర్చులు పెరిగిపోవడంతో మధ్య తరగతి జీవులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఐదారు వేలతో గడిచే రోజులు పోయాయి. ఇప్పుడదే ఖర్చు 15 నుంచి 20 వేలకు చేరింది. దానికి తగ్గట్టు జీతాలు మాత్రం పెరగడం లేదని చాలా మంది వాపోతున్నారు. సంపాదించేది ఎంత ఉన్నా.. చివరికి నెల ఆఖరుకి చేతిలో ఏమీ మిగలడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ కష్టాలకు తోడు, కుటుంబంలో అనవసరపు ఖర్చులతో ఆర్థిక భారం మరింత పెరుగుతోంది. ప్రస్తుతం నలుగురు సభ్యులు ఉన్న మధ్య తరగతి కుటుంబం నగరంలో సాధారణ జీవితం గడపాలంటే నెలకి కనీసం రూ.50 వేలకు పైగా అవసరమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆదాయం ఆ స్థాయిలో లేకపోతే నిత్యం అప్పులు చేయక తప్పడం లేదు. ఈ పరిస్థితుల్లో దురలవాట్లు ఉన్నవారు మరింత కష్టపడక తప్పదని అంటున్నారు.

పెరుగుతున్న ఈ ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి కొన్ని మార్గాలను అనుసరించవచ్చు. అనవసరపు ఖర్చులను తగ్గించుకోవాలి, అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ఉండటానికి ప్రయత్నించాలి. వీలైనంత వరకు ఇంటి వద్దే భోజనం చేయడం, వినోద కార్యక్రమాలకు తక్కువ ఖర్చు పెట్టడం వంటి చిన్నపాటి మార్పులు ఆర్థిక భారాన్ని కొంతవరకు తగ్గించగలవు. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే, ఖర్చులను అదుపులో ఉంచుకోవడమే సరైన మార్గం అని చెప్పవచ్చు.

భవిష్యత్తులో లక్ష రూపాయల వేతనం వచ్చినా  ఇబ్బందులు మాత్రం కొనసాగుతాయని  మనిషి జీవనశైలిలో మార్పులు ఇందుకు ప్రధాన కారణమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటినుంచి సేవింగ్స్ మొదలుపెడితే మాత్రమే భవిష్యత్తులో వచ్చే సమస్యలను సులువుగా  అధిగమించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: