ఊహించని విధంగా భీమవరంలో వైసీపీ తరుపున నిలబడిన గ్రంథి శ్రీనివాస్ సూపర్ విక్టరీ కొట్టేశారు. జగన్ వేవ్‌లో పవన్‌పై దాదాపు 8 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక పవన్ మీద గెలవడంతో గ్రంథిపై భీమవరం ప్రజలు ఎక్కువ అంచనాలు పెట్టుకున్నారు. ఇక శ్రీనివాస్ కూడా భీమవరం ప్రజల అంచనాలకు తగ్గట్టుగానే పనిచేస్తున్నారు.