2019 ఎన్నికల్లో జగన్ గాలికి ధీటుగా నిలబడి టీడీపీ తరుపున 23 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించారు. అయితే అలా 23 మంది ఎమ్మెల్యేలు సాధించడానికి ప్రధాన కారణం. ఆయా నేతల సొంత బలం వలనే చెప్పొచ్చు. పార్టీకి ఉన్న కేడర్‌తో పాటు సొంత ఇమేజ్ తోడు అవ్వడంతో టీడీపీ తరుపున విజయం సాధించగలిగారు. అలా సొంత ఇమేజ్‌తో సత్తా చాటిన నాయకుల్లో విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ ఒకరు.