2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు జగన్ ప్లస్ అనే చెప్పొచ్చు. కేవలం ఆయన బొమ్మ చూసే జనాలు ఓట్లు వేశారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వైసీపీ నుంచి గెలిచిన 151 మంది ఎమ్మెల్యేల్లో ఎక్కువ శాతం జగన్ ఇమేజ్ మీద ఆధారపడే విజయం బాట పట్టారు. అయితే ఎన్నికలై ఏడాది దాటింది. ఇప్పుడు కూడా చాలామంది ఎమ్మెల్యేలకు జగనే దిక్కు అవుతున్నారు.