శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ బాగా వీక్‌గా ఉన్న నియోజకవర్గాల్లో రాజాం ఒకటి. గత రెండు పర్యాయాల నుంచి ఇక్కడ టీడీపీ గెలుపు రుచి చూడలేదు. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా వైసీపీ నుంచి కంబాల జోగులు విజయం సాధిస్తున్నారు. అయితే ప్రస్తుతం వైసీపీలో ఉన్న జోగులు రాజకీయ జీవితం మొదలైంది టీడీపీలోనే. 2004లో టీడీపీ టికెట్ దక్కించుకుని వైఎస్ గాలిలో కూడా కాంగ్రెస్ అభ్యర్ధిపై పాలకొండ నుంచి విజయం సాధించారు. అయితే ఆ తర్వాత ప్రజారాజ్యంలోకి వెళ్ళి 2009 ఎన్నికల్లో పాలకొండ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనం అవ్వడం, వైసీపీ ఆవిర్భవించడంతో అటు వెళ్ళిపోయారు. వైసీపీ నుంచి 2014 ఎన్నికల్లో రాజాం నుంచి పోటీ చేసి, టీడీపీ సీనియర్ నాయకురాలు ప్రతిభా భారతిపై కేవలం 512 ఓట్ల తేడాతో గెలిచారు.