విజయనగరం జిల్లాలో టీడీపీకి కాస్త పట్టున్న నియోజకవర్గాల్లో పార్వతీపురం ఒకటి. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి ఇక్కడ టీడీపీ 5 సార్లు విజయం సాధించగా, కాంగ్రెస్ మూడుసార్లు విజయం సాధించింది. అయితే 2019 ఎన్నికల్లో జగన్ వేవ్‌లో ఇక్కడ టీడీపీ తరుపున పోటీ చేసిన బొబ్బిలి చిరంజీవులు ఘోరంగా ఓడిపోయారు. వైసీపీ నుంచి పోటీ చేసిన అలజంగి జోగారావు దాదాపు 24 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు.