అధికార వైసీపీకి గిరిజన ప్రాంతాల్లో మంచి పట్టున్న విషయం తెలిసిందే. టీడీపీ వేవ్ ఉన్న 2014లోనే కీలకమైన అరకు పార్లమెంట్ స్థానాన్ని వైసీపీ దక్కించుకుంది. అలాగే పార్లమెంట్ పరిధిలో ఉన్న మెజారిటీ అసెంబ్లీ స్థానాలని గెలిచింది. ఇక 2019 ఎన్నికల్లో అయితే అరకు పార్లమెంట్‌తో పాటు, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలని గెలిచింది. అలా అరకు పార్లమెంట్ పరిధిలో ఉన్న పాలకొండ నియోజకవర్గంలో కూడా వైసీపీ సత్తా చాటింది. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా విశ్వాసరాయి కళావతి విజయం సాధించారు.