అనంతపురం జిల్లా...హిందూపురం...టీడీపీ అడ్డా...ఎన్టీఆర్ టీడీపీ స్థాపించాక...ఇక్కడ మరో పార్టీకి విజయం దక్కలేదు. 1983 నుంచి 2019 వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో ఇక్కడ టీడీపీదే విజయం. ఇక 1985 ఎన్నికల్లో ఎన్టీఆర్ డైరక్ట్‌గా హిందూపురంలో బరిలో నిలబడి అదిరిపోయే విజయం సాధించారు. తర్వాత 1989, 1994 ఎన్నికల్లో కూడా ఎన్టీఆర్ ఇక్కడ నుంచే పోటీ చేసి గెలిచారు. ఆయన మరణం తర్వాత వచ్చిన 1996 ఉపఎన్నికలో ఎన్టీఆర్ తనయుడు నందమూరి హరికృష్ణ పోటీ చేసి గెలిచారు. ఇక తర్వాత 1999, 2004,2009 ఎన్నికల్లో కూడా ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్ధులే విజయం సాధించారు.