కర్నూలు జిల్లా వైసీపీకి కంచుకోట అనే విషయం తెలిసిందే. అందుకే 2019 ఎన్నికల్లో కర్నూలులో మొత్తం సీట్లు వైసీపీనే గెలిచింది. అయితే ఇక్కడ టీడీపీ చాలా వీక్‌గా ఉంటుంది. ఎన్నికల్లో సున్నా సీట్లు తెచ్చుకుంది. పైగా టీడీపీ నాయకులు భారీ మెజారిటీలతో ఓడిపోయారు. కానీ బనగానపల్లె నియోజకవర్గంలో టీడీపీ నేత బీసీ జనార్ధన్ రెడ్డి తక్కువ మెజారిటీతోనే ఓడిపోయారు.