కడప జిల్లా అంటేనే వైఎస్సార్ ఫ్యామిలీ అడ్డా అనే విషయం తెలిసిందే. జిల్లాలో ప్రతి నియోజకవర్గంపై వైఎస్సార్ ఫ్యామిలీకి పట్టుంది. అందుకే గతంలో జిల్లాలో కాంగ్రెస్ హవా ఉండేది. ఇప్పుడు వైసీపీ ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక జిల్లాలో రాయచోటి వైసీపీ కంచుకోట. ఇక్కడ గడికోట శ్రీకాంత్ రెడ్డి హవా ఎక్కువగా ఉంది.