విజయనగరం జిల్లాలో బొత్స ఫ్యామిలీ హవా ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే. బొత్స కాంగ్రెస్లో ఉన్న, ఇప్పుడు వైసీపీలో ఉన్న జిల్లాపై పెత్తనం ఆయనదే. ఇక 2019 ఎన్నికల్లో బొత్స ఫ్యామిలీ విజయనగరం జిల్లాలో సత్తా చాటిన విషయం తెలిసిందే. బొత్స చీపురుపల్లి నుంచి గెలిస్తే, బొత్స సోదరుడు అప్పలనరసయ్య గజపతినగరం నుంచి గెలిచారు.