శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన ఫ్యామిలీ హవా ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే. రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి జిల్లాలో ధర్మాన ప్రసాదరావు, కృష్ణదాస్ల ఆధిక్యం ఉండేది. అయితే కాంగ్రెస్ కనుమరుగయ్యాక పరిస్థితి మారింది. దీంతో ఇద్దరు నేతలు వైసీపీలోకి వచ్చి సత్తా చాటుతున్నారు. 2019 ఎన్నికల్లో ధర్మాన కృష్ణదాస్ నరసన్నపేట నుంచి గెలిచి జగన్ కేబినెట్లో మంత్రిగా ఉన్నారు. అటు ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం అసెంబ్లీ నుంచి విజయం సాధించి, జిల్లాలో కీలకంగా ఉన్నారు.