ఏపీలో చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు ఇంకా జగన్ బొమ్మని నమ్ముకునే బండి లాగిస్తున్నట్లు కనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో ఎక్కువమంది ఎమ్మెల్యేలు జగన్ ఇమేజ్ వల్లే గెలిచారు. అందులో ఎలాంటి అనుమానం లేదు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావొస్తున్న కూడా కొందరు ఎమ్మెల్యేలు జగన్ ఇమేజ్ నమ్ముకునే ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది.