జోగి రమేష్...అధికార వైసీపీలో ఉన్న ఫైర్ బ్రాండ్ నాయకుల్లో ఒకరు. ప్రతిపక్షాలకు చుక్కలు చూపించే నాయకుడు. ఏ మాత్రం మొహమాటం లేకుండా ప్రతిపక్ష టీడీపీపై విరుచుకుపడుతుంటారు. కేవలం వైసీపీ నాయకుడుగానే కాకుండా, ఎమ్మెల్యేగా కూడా జోగి దూసుకెళుతున్నారు. వైఎస్సార్ అభిమానిగా ఉన్న రమేష్ కాంగ్రెస్ ద్వారా రాజకీయ జీవితం మొదలుపెట్టి, కృష్ణా జిల్లాలోని తన సొంత నియోజకవర్గం మైలవరం నుంచి కాకుండా 2009లో పెడనలో పోటీ చేసి అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు.