ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనతో ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్తితి ఘోరంగా తయారైన విషయం తెలిసిందే. పార్టీ పరిస్తితి బాగోకపోవడంతో కాంగ్రెస్ నేతలు టీడీపీ, వైసీపీల్లోకి జంప్ కొట్టేశారు. దాదాపు 90 శాతం నాయకులు కాంగ్రెస్‌ని వదిలేశారు. దశాబ్దాల పాటు కాంగ్రెస్‌లో రాజకీయం చేసిన నాయకులకు జంప్ చేయడం తప్పలేదు. అలా దశాబ్దాల పాటు కాంగ్రెస్‌లో కీలకంగా వ్యవహరించిన అనంత వెంకట్రామి రెడ్డి సైతం వైసీపీలోకి వచ్చేశారు.