కరణం బలరాం...ఏపీ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు. దశాబ్దాల పాటు తెలుగుదేశం పార్టీలో రాజకీయాలు చేసిన కరణం, 2019 ఎన్నికల తర్వాత ఊహించని విధంగా వైసీపీ వైపుకు వచ్చేశారు. 2019 ఎన్నికల్లో చీరాల అసెంబ్లీ నుంచి పోటీ చేసి కరణం విజయం సాధించారు. అది కూడా ఆమంచి కృష్ణమోహన్‌పై. ఆమంచి 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి చీరాల నుంచి గెలిచారు.