కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి....వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో బాగా హైలైట్ అయిన ఎమ్మెల్యే. నిరంతరం ప్రజల్లో తిరుగుతున్న కేతిరెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ వచ్చింది. ఇలా ప్రజల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న కేతిరెడ్డి...రాజకీయ ఎంట్రీ అనూహ్యమైన పరిస్థితుల్లో జరిగింది. 2006లో తన తండ్రి కేతిరెడ్డి సూర్యప్రతాపరెడ్డి హత్యకు గురికావడంతో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక తర్వాత వైసీపీలోకి వచ్చిన కేతిరెడ్డి 2014 ఎన్నికల్లో ధర్మవరం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.