మల్లాది విష్ణు....కృష్ణా జిల్లా రాజకీయాల్లో సీనియర్ నాయకుడు. ముఖ్యంగా విజయవాడలో కీలకంగా ఉన్న మల్లాది...గతంలో కాంగ్రెస్లో పనిచేశారు. 2009లో కాంగ్రెస్ తరుపున పోటీ చేసి విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ తరుపున పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు.