కృష్ణా జిల్లా వైసీపీలో ఉన్న బలమైన నాయకుల్లో సామినేని ఉదయభాను కూడా ఒకరు. గతంలో సామినేని కాంగ్రెస్లో పనిచేశారు. టీడీపీ వేవ్ ఉన్న 1999 ఎన్నికల్లోనే జగ్గయ్యపేటలో కాంగ్రెస్ తరుపున నిలబడి విజయం సాధించారు. ఇక అదే ఊపులో 2004లో సైతం గెలిచారు. 2009లో ఓడిపోయిన సామినేని ఆ తర్వాత వైసీపీలోకి వెళ్ళి 2014లో సైతం ఓటమి పాలయ్యారు.