రాజకీయాల్లో కష్టంతో పాటు కాస్త అదృష్టం కలిసొస్తే పదవులు ఆటోమేటిక్గా వస్తాయి. కానీ ఒకోసారి అదృష్టం ఉంటే చాలు పదవులు దక్కుతాయి. అలా రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్యే టికెట్ దక్కించుకుని, ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు హఫీజ్ ఖాన్... ఎన్ఆర్ఐగా రాజకీయాల్లోకి వచ్చిన హఫీజ్ వెంటనే వైసీపీలో చేరిపోయారు. దానికి తోడు వెంటనే టికెట్ దక్కించుకున్నారు. ఇక టికెట్ దక్కించుకోవడమే కాదు. కర్నూలులో రాజకీయ దిగ్గజం టీజీ వెంకటేష్ వారసుడుని ఓడించి ఎమ్మెల్యేగా గెలిచారు.