గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌ని ఓడించిన గ్రంథి శ్రీనివాస్‌పై భీమవరం ప్రజలు బాగానే ఆశలు పెట్టుకున్నారనే చెప్పొచ్చు. సంచలన విజయం సాధించిన గ్రంథిపై అక్కడ ప్రజలకు ఎన్నో అంచనాలు ఉన్నాయి. అలా పవన్‌పై సూపర్ విక్టరీ కొట్టిన గ్రంథి శ్రీనివాస్ ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేస్తున్నారా? అంటే కొంచెం అవునని, కొంచెం కాదని భీమవరం ప్రజల నుంచి సమాధానం వస్తుందని చెప్పొచ్చు.