విజయనగరం జిల్లా రాజకీయాలపై బొత్స ఫ్యామిలీకి ఎంత పట్టు ఉందో అందరికీ తెలిసిందే. దశాబ్దాల కాలం నుంచి విజయనగరం రాజకీయాల్లో బొత్స సత్యనారాయణ కీలక పాత్ర పోషిస్తున్నారు. అప్పటిలో కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీలో బొత్స జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్నారు. గత ఎన్నికల్లో విజయనగరంలో వైసీపీ క్లీన్‌స్వీప్ చేయడంలో బొత్స కీలక పాత్ర పోషించారు. ఆ ఎన్నికల్లో బొత్స గెలవడంతో పాటు ఆయన సోదరుడు అప్పలనరసయ్య కూడా సూపర్ విక్టరీ కొట్టారు.