కడప జిల్లా అంటేనే వైఎస్సార్సీపీ అడ్డా...ఆ జిల్లాలో ఉన్న పది నియోజకవర్గాలు వైసీపీకి కంచుకోటలు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా రాయచోటి నియోజకవర్గం అధికార వైసీపీకి కంచుకోట....ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచి చాలా ఏళ్ళు అయిపోయాయి. అసలు రాయచోటిలో టీడీపీ కేవలం రెండుసార్లు గెలవగా, అది కూడా 1999, 2004 ఎన్నికల్లోనే టీడీపీ జెండా ఎగరగా, అక్కడ నుంచి ఇక్కడ టీడీపీకి విజయం దక్కలేదు. ఇక భవిష్యత్లో కూడా ఇక్కడ టీడీపీకి గెలిచే ఛాన్స్ ఉన్నట్లు కనిపించడం లేదు.