గత ఎన్నికల్లో భీమవరంలో పవన్ కల్యాణ్‌ని ఓడించిన గ్రంథి శ్రీనివాస్ పేరు ఎప్పుడు ఏపీ రాజకీయాల్లో వినిపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే ప్రజల్లో ఎంతో క్రేజ్ ఉన్న పవన్‌ని ఓడించడమంటే మాటలు కాదనే చెప్పాలి. అసలు భీమవరంలో పవన్ కల్యాణ్ ఖచ్చితంగా గెలిచేస్తారని అంతా అనుకున్నారు. కానీ అంచనాలు తారుమారు చేస్తూ, జగన్ వేవ్‌లో గ్రంథి శ్రీనివాస్ విజయం సాధించారు.