చిత్తూరు జిల్లా అనగానే మొన్నటివరకు టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా అని, టీడీపీకి అనుకూలమైన జిల్లా అని తెలిసేది. కానీ ఇప్పుడు పరిస్తితి మారింది. చిత్తూరు జిల్లా అంటే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడ్డా అని గట్టిగా చెప్పొచ్చు. ఈయన వల్లే జిల్లాలో టీడీపీకి చెక్ పెట్టి వైసీపీ బలమైన స్థానంలో ఉంది. ఈయన ప్రభావం జిల్లాల్లో చాలా నియోజకవర్గాల్లో ఉంది.

అయితే అలా పెద్దిరెడ్డి ప్రభావంతోనే తంబళ్ళపల్లె నియోజకవర్గంలో పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గత ఎన్నికల్లో వైసీపీ తరుపున భారీ మెజారిటీతో గెలిచారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి తంబళ్ళపల్లె నియోజకవర్గంలో సత్తా చాటుతున్నారు. అన్న పెద్దిరెడ్డి సపోర్ట్‌తో నియోజకవర్గంలో మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు.

ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటూ, వారి సమస్యలని పరిష్కరించడంలో ద్వారకానాథ్ ముందే ఉంటున్నారు. అలాగే నియోజకవర్గంలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారు. అటు గాలేరు-నగరి, హంద్రీనీవా ఎత్తిపోత ప్రాజెక్టులకు శంఖుస్థాపన జరిగింది. ఈ ప్రాజెక్టులతో జిల్లాలో త్రాగునీరు, సాగునీరు సమస్యలు తొలగనున్నాయి. అదేవిధంగా నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. కొత్తగా సిమెంట్ రోడ్ల నిర్మాణం, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ కేర్ సెంటర్లు, వాటర్ ట్యాంకుల నిర్మాణాలు జరుగుతున్నాయి.

అలాగే ఆపదలో ఉన్నవారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సాయం చేస్తూ, పేదలకు అండగా నిలబడుతున్నారు. ఈ విధంగా ఎమ్మెల్యేగా ద్వారకానాథ్ రెడ్డి దూసుకెళుతున్నారు. ఇక ఈయనకు చెక్ పెట్టడం టీడీపీకి కష్టమే అని తెలుస్తోంది. ద్వారకానాథ్ దెబ్బకు తంబళ్లపల్లె వైసీపీకి కంచుకోటగా మారిపోయిందని చెప్పొచ్చు. ఇక్కడ టీడీపీ నేత శంకర్ కూడా సైలెంట్‌గా ఉంటున్నారు. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు పెద్దగా చేయడం లేదు. దీంతో టీడీపీ క్యాడర్ చాలావరకు వైసీపీ వైపుకు వచ్చేసింది. ఏదేమైనా ఇక తంబళ్లపల్లెలో పెద్దిరెడ్డి సోదరుడుకు చెక్ పెట్టడం కష్టమే.


మరింత సమాచారం తెలుసుకోండి: