తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్తితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు...అసలు పరిస్తితి ఇలా ఉంది..అలా ఉంది అని మాట్లాడుకోవడానికి ఇక్కడ పార్టీనే సరిగ్గా లేదని చెప్పొచ్చు. ఏదో పేరుకు పార్టీ ఉంది గాని, నాయకులు మాత్రం లేరు. అసలు తెలంగాణ రావడం, 2014లో టీఆర్ఎస్ గెలవడం, అలాగే అనూహ్యంగా ఓటుకు నోటు కేసు రావడంతో...రాష్ట్రంలో టీడీపీ కనుమరుగయ్యే పరిస్తితి వచ్చేసింది. పైగా పార్టీకి బలమైన నాయకత్వం లేకపోవడం కూడా మైనస్ అయింది. చంద్రబాబు పూర్తిగా ఏపీకే పరిమితం కావడం కూడా పెద్ద మైనస్. అసలు తెలంగాణలో కొందరు నేతలు టీడీపీని వదలడానికి రీజన్ కూడా ఇదే. సరైన నాయకత్వం లేకపోవడం వల్లే...కొందరు టీడీపీని వదిలేశారు.

ఇదే క్రమంలో ఒకప్పుడు నిజామాబాద్ టీడీపీలో కీలకంగా ఉన్న హనుమంత్ షిండే సైతం...చంద్రబాబు లేరనే టీడీపీని వదిలిపెట్టేశారు. అసలు ఈయన టీడీపీలోనే రాజకీయ జీవితం మొదలుపెట్టారు. 2004 ఎన్నికల్లో జుక్కల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కానీ 2009 ఎన్నికల్లో అదే జుక్కల్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. టీడీపీ తరుపున ఆయన సత్తా చాటారు.

కానీ రాష్ట్రంలో టీడీపీ పరిస్తితి దిగజారిపోవడం, పైగా చంద్రబాబు ఏపీకే పరిమితం కావడంతో షిండే...టీడీపీని వదిలి టీఆర్ఎస్‌లో చేరి, వరుసపెట్టి 2014, 2019 ఎన్నికల్లో గెలిచారు. రెండుసార్లు భారీ మెజారిటీలతోనే గెలిచారు. ఇలా వరుసగా గెలిచిన షిండే...ప్రజలకు టచ్‌లోనే ఉంటారు. అలాగే ఈ ఏడున్నర ఏళ్లలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అయితే ఈయన ఎక్కువ వివాదాల్లో కూడా లేకపోవడం ప్లస్. అలాగే జుక్కల్‌లో గత మూడు పర్యాయాలు కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత గంగారామ్ పోటీ చేస్తూ ఓడిపోతున్నారు. ఓడిపోతున్న సానుభూతి గంగారామ్‌పై ఉంది. ఇటు జుక్కల్‌లో బీజేపీకి అంత బలం లేదు. అయితే నెక్స్ట్ కూడా జుక్కల్‌లో హన్మంత్ షిండేకు తిరుగులేదనే పరిస్తితి.  


మరింత సమాచారం తెలుసుకోండి: