
అందుకే వాటిని నల్ల బంగారం అని కూడా తెలుస్తూ ఉంటారు ఇండియాలో 90 శాతం మంది కేరళ వాసులు మిరియాలను ఉత్పత్తి చేస్తున్నారు. మిరియాల ధర ఎక్కువగా ఉండడానికి గల కారణం సాగు ఎక్కువ కాలం పట్టడమే అందుకే మిరియాల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. మిరియాల చెట్లకు పువ్వులు వచ్చిన ఆరు నెలల తర్వాత మిరియాలు వస్తాయి.. కాబట్టి ఈ సాగు చేపట్టినట్లయితే రైతులకు మంచి లాభాలు వస్తాయి నిజానికి మోస్ట్ పాపులర్ కరిముంద మిరియాలను కేరళలో సాగు చేస్తున్నారు. పన్నియుర్ 1 అనే జాతి మిరియాల సాగు చేపడితే ఎకరానికి 500 కేజీల మిరియాల దిగుబడి మీరు పొందవచ్చు. ఒకవేళ పన్నియూర్ 2 జాతి మిరియాలు సాగు చేసినట్లయితే ఎకరాకి 1100 కేజీలు వస్తాయి . ఇలా ఒక్కో జాతిని బట్టి వీటి దిగుబడి మారుతూ ఉంటుంది.
మిరియాల పంటకు వేడి వాతావరణం అవసరం.. కాబట్టి మన తెలుగు రాష్ట్రాలు బాగా సెట్ అవుతాయి.. ఇక్కడ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. కాబట్టి పూలు త్వరగా వస్తాయి. పది అడుగుల ఎత్తు పెరుగుతూనే దిగుబడిని ఇస్తాయి. కాబట్టి ఒక్కసారి మొక్కలు వేశారంటే ఎనిమిది సంవత్సరాల పాటు మీరు లాభాన్ని పొందవచ్చు అయితే ఈ వ్యాపారం చేయాలంటే రైతులకు కాస్త సహనం ఉంటే సరిపోతుంది.