తెలుగు ఇండస్ట్రీలో తన గానామృతంతో ఎన్నో పాటలు పాడి అందరి హృదయాలు దోచిన సింగర్ సునిత మొట్టమొదటి సారిగా కెమెరా ముందుకు రాబోతుంది.  లక్షణమైన సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, యాంకర్ గా పాపులారిటీ తెచ్చుకున్న సింగర్ సునీత తన సక్సెస్ ఫుల్ కెరీర్ లో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకుంది. ఈ వేలలో నీవు ఏం చేస్తు ఉన్నావో అనే పాట ఇప్పటికీ ఎప్పటికీ మరువలేం..ఈ పాటతోనే సునితకు కూడా మంచి గుర్తింపు వచ్చింది. సింగర్ గా , వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సునిత ఇప్పటి వరకు వెండితెరపై నటించలేదు. అలాగని టీవీ సీరియల్స్ కూడా నటించలేదు. కాకపోతే యాంకర్ గా మాత్రం అందరి మనసు దోచింది.  
Image result for singer sunitha
ఆ మద్య తన భర్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంచలనానికి తెరలేపిన సింగర్ సునిత బుల్లితెరపై యాంకర్ గా అందరికీ సుపరిచితమే. తాజాగా ఆమె నటించబోతుంది..అది కూడా ఓ షార్ట్ ఫిలింలో.  గతంలో నటించే అవకాశాలు ఎన్నో వచ్చిన ఇప్పటి వరకు స్పందిచలేదు. కానీ  రోలింగ్ రీల్ ఎంటర్ టైన్మెంట్- రేణుక టాకీస్ సంస్థలు సంయుక్తంగా ఓ షార్ట్ ఫిల్మ్ ని తెరకెక్కిస్తున్నాయి.
Image result for singer sunitha husband
ఈ చిత్ర షూటింగ్ కార్యక్రమాలు గురువారం మొదలయ్యాయి. దీనికి చైతన్య శ్రీ పెరంబుదూర్ డైరెక్టర్. గతంలో శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన 'అనామిక' మూవీ ప్రమోషన్ కోసం స్పెషల్ గా రెడీ చేసిన వీడియోలో సునీత నటించిన విషయం తెల్సిందే కదా. 


మరింత సమాచారం తెలుసుకోండి: