చిత్ర‌సీమ‌లో మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన కాంబినేష‌న్‌కు తెర లేవ‌నుందా?? క‌మ‌ల్‌హాస‌న్‌, ర‌జ‌నీకాంత్ క‌ల‌సి న‌టిస్తున్నారా?? ఈ కాంబోలో తెర‌కెక్కే చిత్రానికి ర‌జ‌నీకాంత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారా? క‌మ‌ల్‌హాస‌న్ మాట‌లు వింటుంటే అది నిజ‌మే అనిపిస్తోంది. క‌మ‌ల్‌హాస‌న్ బిగ్ బాస్ త‌మిళ వెర్ష‌న్‌కి వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నారు.


ఈ సంద‌ర్భంగా చెన్నైలో క‌మ‌ల్ మీడియాతో మాట్లాడుతూకొన్ని ఆస‌క్తిక‌ర‌మైన సంగ‌తులు చెప్పుకొచ్చారు. ర‌జ‌నీ తాను క‌ల‌సి న‌టిస్తే.. అంద‌రికీ చూడాల‌ని వుంద‌ని, ఆ కోరిక త‌మ ఇద్ద‌రిలోనూ ఉంద‌న్న సంగ‌తి బ‌య‌ట‌పెట్టాడు క‌మ‌ల్‌హాస‌న్‌. ”మా ఇద్ద‌రి కెరీర్ ఇంచుమించు ఒకేలా ప్రారంభ‌మైంది. ఇద్ద‌రం క‌ల‌సి కొన్ని చిత్రాల్లో న‌టించాం. ఇప్పుడు మ‌ళ్లీ క‌ల‌సి న‌టించాల‌నుకొంటున్నాం. గ‌త ఐదేళ్లుగా త‌గిన క‌థ కోసం ఎదురుచూస్తున్నాం” అన్నాడు క‌మ‌ల్‌. అంతేకాదు.. ఆసినిమాకి ర‌జ‌నీకాంత్‌ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తార‌ని, కాని ప‌క్షంలో ఆ బాధ్య‌త తానే తీసుకొంటాన‌ని చెప్పుకొచ్చాడు క‌మ‌ల్‌.


క‌మ‌ల్ – ర‌జ‌నీ ఆప్త మిత్రులు. ఇద్ద‌రికీ గురువు ఒక్క‌రే… ఆయ‌నే బాల‌చంద‌ర్‌. అయితే ఆమ‌ధ్య ఇద్ద‌రి మ‌ధ్యా గ్యాప్ పెరిగింది. సామాజిక‌, రాజకీయ స‌మీక‌ర‌ణాల దృష్ట్యా ఎడ‌మొహం పెడ‌మొహంగానేఉన్నారు. అయితే ఎందుక‌నో ఈమ‌ధ్య ర‌జ‌నీకాంత్ కి ద‌గ్గ‌ర‌వ్వాల‌ని చూస్తున్నాడు క‌మల్‌. అందులో భాగంగానే ఇలాంటి ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేసి ఉండొచ్చ‌ని కోలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ప్ర‌స్తుతం క‌మ‌ల్ దృష్టి విశ్వ‌రూపం 2 సినిమా పై ప‌డింది. దీన్ని వీలైనంత త్వ‌ర‌గా విడుద‌ల చేద్దామ‌నే ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: