సామాన్యులు, మధ్యతరగతి వారు బంగారాన్ని కొనాలంటే భయపడేలా ధరలు పెరిగిపోయాయి. పసిడి ధరలు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఒక తులం బంగారం రూ .1,20,000కు చేరుకుంది.ఇంకా ఎంత పెరుగుతుంది ? తగ్గుతుంది? అనే విషయం అంచనాలకు కూడా దొరకడం లేదు. కానీ మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఏడాది 10 గ్రాముల బంగారం ధర 39,000 రూపాయల వరకు పెరిగింది అంటే దాదాపుగా 54 శాతం వరకు పెరిగింది. నిత్యం పెరుగుతున్న ధరలు సామాన్య ప్రజలకు చుక్కలు చూపించేలా కనిపిస్తోంది.


వాస్తవానికి బంగారం ధరల రెట్లు అంతర్జాతీయంగా  డిక్టేట్ అవుతాయా అంటే కాదు.. మన భారతదేశంలో ఉన్నటువంటి వ్యాపారుల మాఫియా, అంతర్జాతీయ మాఫియా కలిసి ఇలా అడ్డగోలుగా బంగారం ధరలను పెంచేస్తున్నారు. అలా పెంచడం వల్లే ఇప్పుడు 1,20,000కి పైగా తులం బంగారం ధర వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు ఈ బంగారం ధరలు పెరగడానికి గల ముఖ్య కారణాలు ఏంటి అనే విషయంపై అంతర్జాతీయ మాఫియా వ్యాపారులు కలసి ధరలు పెంచేసి, ఏం చెబుతున్నారంటే.. ప్రపంచవ్యాప్తంగా డాలర్ల వాడకం తగ్గిందని, బ్రిక్స్ దేశాలు భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయని,  గోల్డ్ ధరలు అందువల్లే పెరుగుతున్నాయి అని చెప్తున్నారు.


రష్యా ,ఉక్రెయిన్ వంటి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల స్టాక్స్, క్రిప్టో  మార్కెట్ నిలకడలేని పరిస్థితుల వల్ల పెట్టుబడిదారులు బంగారం పైనే సురక్షిత పెట్టుబడిలాగే భావిస్తున్నారు. అంతేకాకుండా బంగారం ఉత్పత్తి తగ్గడం,  డాలర్ బలహీనపడడం వంటివి జరిగాయని దీనివల్లనే బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయంటూ తెలుపుతున్నారు. ఇలా నిత్యం బంగారం ధరలు అటు సామాన్యుడికి భారంగా మారుతున్నాయి. శుభ కార్యాల సమయంలో ప్రత్యేకించి బంగారు కొనుగోలు చేయాలనే వారికి ఇప్పుడు బంగారం అందని ద్రాక్ష వలె మారిందని పలువురు కామెంట్లు చేస్తున్నారు. సామాన్యుడు కొనగలిగే స్థాయికి బంగారం ఎప్పుడు దిగివస్తుందో.. అసలు దిగివస్తుందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: