ఈ మద్య సినిమాల్లో నటిస్తున్న..నటించిన హీరోయిన్లు..ఇతర రంగాలకు చెందిన వారు వరుసగా తమపై జరిగిన లైంగిక దాడుల గురించి బహిరంగంగానే చర్చిస్తున్నారు.   మీ టూ ఉద్యమం పుణ్యమా అని తనూ శ్రీదత్త తీసుకు వచ్చిన పోరాటం బాలీవుడ్ లో ప్రకంపణలు సృష్టిస్తున్నారు.  గతంలో తనపై నానా పటేకర్, కొరియోగ్రాఫర్ లు అసభ్యంగా ప్రవర్తించారని..లైంగికంగా వేధించారని ఆరోపించింది. 

ఆమె తర్వాత కంగనా రౌనత్ కూడా బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎదగాలంటే కొంతమందికి లొంగి తిగిగే పరిస్థితి ఉంటుందని సంచలన కామెంట్ చేసింది.  ఎంతో మంది దళారులు సినీ పరిశ్రమలో ఉంటారని..వారందరినీ దాటుకొని వస్తేనే హీరోయిన్ అయ్యే ఛాన్స్ ఉందని ఆవేదన వ్యక్తం చేసింది కంగనా.  తాజాగా సినీ పరిశ్రమలో మహిళలను చాలా తక్కువగా చూస్తుంటారని నటి సమీరా రెడ్డి వాపోయింది. మహిళలను ట్రీట్ చేసే విధానం మారాలంటూ కామెంట్స్ చేస్తోంది. ఈ మద్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సమీరా రెడ్డి తన సినీ కెరీర్ లో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి తెలిపింది. 

ఎంతో మంది యువతులు అవకాశాలను ఎరగా చూపిస్తూ వాడుకోవాలనుకుంటారని, చాలా రకాలుగా ఇబ్బంది  పెడుతుంటారని, మహిళ అంటే కేవలం గ్లామర్ వస్తువుగానే చూస్తారంటూ సంచలన కామెంట్స్ చేసింది. పరిశ్రమలో పురుషులను, స్త్రీలను సమానంగా చూడరని, రెమ్యునరేషన్ విషయంలోనే కాకుండా గౌరవం విషయంలో కూడా అసమానతలు స్పష్టంగా కనిపిస్తాయని అన్నారు. ఇటీవల కాలంలో కాస్టింగ్ కౌచ్, మీ టూ ఉద్యమాలు మహిళల్లో ఎంతో చైతన్యం తీసుకు వస్తుందని అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: