బాలీవుడ్ లో సంచలన తారగా పేరు తెచ్చుకుంది రాఖీ సావంత్.  బుల్లితెర, వెండి తరపై ఎప్పుడూ తన కాంట్రవర్సీ వ్యాఖ్యలతో సంచలనం రేపుతుంది.  తెలుగులో 6 టీన్స్ మూవీలో ఓ స్పెషల్ సాంగ్ లో నటించింది. 1978, నవంబరు 25 న జన్మించిన రాఖీ సావంత్ ఒక సాంప్రదాయ కుటుంబంలో జన్మించింది. రాఖీ సావంత్ అసలు పేరు నీరూ బేదా.  తాజాగా రాఖీ సావంత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..తన కెరీర్ ఎన్ని కష్టాలతో సాగిందని..అంటూ కన్నీరు పెట్టుకున్నారు.  చిన్నతనంలో తాను డాన్స్‌ నేర్చుకుంటానని చెపితే తన అంకుల్‌ విపరీతంగా కొట్టాడని ఓ ఇంటర్య్వూలో వెల్లడించింది రాఖీ. 

 

ఎందుకంటే ఆ ఇంట్లో డ్యాన్స్ అంటే ఆమడ దూరంగా ఉండేవారని..తమ సాంప్రదాయాలకు అది చెడ్డపేరు తీసుకు వస్తుందని భావించేవారట. అయినా తనకు మాత్రం డ్యాన్స్, నటనపై చిన్నతనం నుంచే పెరిగిపోవడంతో ఇల్లు వదిలి పారిపోయిందట. ఇక సినిమాల్లో అవకాశాల కోసం నీరు భేదాగా ఉన్న పేరును రాఖీ సావంత్‌గా మార్చుకున్నట్టు వెల్లడించింది. ‘అగ్నిచక్ర’ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయం అయిన రాఖీ సావంత్‌, స్కిన్‌ షోతోనే ఎక్కువగా ఫేమస్‌ అయ్యింది. అదే సమయంలో పాప్ వీడియో సాంగ్ లో కూడా నటించింది. రాఖీ డ్యాన్స్‌ మూమెంట్స్‌కు ఎవరైనా ఫిదా కావాల్సిందే. 

 

అందుకే ఆమె కెరీర్‌లో ఎన్నో సూపర్‌ హిట్‌ ఐటమ్‌ సాంగ్స్‌లో నర్తించింది.  సినిమాల్లోకి రాకముందే తాను ఎన్నో కష్టాలు పడ్డానని తెలిపింది రాఖీసావంత్‌. దర్శక నిర్మాతలను అవకాశాల కోసం కలిసినపుడు వారు తనని రూంలో పెట్టి బందించేవారట...తర్వాత వారి నిజస్వరూపం తెలుసుకొని నానా కష్టలు పడి ఎలాగో అలా బయట పడేదాన్ననని చెప్పారు. తమది ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం కావటంతో పక్కింటి వాళ్లు మిగిల్చిన తిండి తిని బతికేవాళ్లమని తెలిపింది. 

 

అయితే ఇంట్లో నుంచి పారిపోయిన తను ఎన్నో కష్టాలు పడిన తరువాత ఇండస్ట్రీలో ఈ స్థాయికి వచ్చానని ఆవేదన వ్యక్తం చేసింది.  కొంత కాలంగా ఆమె కెరీర్ ఎక్కువగా వివాదాల చుట్టే తిరుగుతుంది. రాఖీ సావంత్ సినీ,రాజకీయ, క్రీడా రంగంలో పాపులర్ ఫిగర్స్ పై అనుచుత వ్యాఖ్యలు చేసి పలుమార్లు నెటిజన్ల కోపానికి గురైంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: