అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా అల వైకుంఠపురంలో.  ఈ సినిమాకు సంబంధించిన మూడు సాంగ్స్ రిలీజ్ అయ్యాయి.  ఇందులో రెండు సాంగ్స్ సూపర్ అనిపించుకోగా... ఓ మైడాడీ సాంగ్ పెద్దగా హిట్ కాలేదు. ఓ మోస్తరుగా హిట్ అయ్యింది.  అయితే, ఈ సినిమాలోని నాలుగో సాంగ్ ను కొన్ని రోజుల క్రితమే రిలీజ్ కావాల్సి ఉన్నా కొన్ని టెక్నికల్ కారణాల వలన వాయిదా పడింది.  


అయితే, నిన్నటి రోజున ఈ సాంగ్ టీజర్ ప్రోమో రిలీజ్ చేశారు.  ఈ విషయంలో యూనిట్ పెద్దగా క్లారిటీ ఇవ్వలేదు. సాంగ్ రిలీజ్ చేస్తామని చెప్పడంతో ఈ సాంగ్ కు సంబంధించిన ప్రమోషన్ ను ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రెచ్చిపోయి చేశారు.  కానీ, సాంగ్ కాకుండా కేవలం సాంగ్ టీజర్ మాత్రమే రిలీజ్ చేయడంతో ఫ్యాన్స్ షాక్ అయ్యారు.  ఈ విషయాన్ని ముందుగా చెప్తే దానికి తగినట్టుగానే ప్రమోషన్ చేసుకునే వాళ్ళం కదా అని అంటున్నారు.  


ఫ్యాన్స్ మాత్రమే కాదు, అటు మూవీ లవర్స్ కూడా ఇదే మాట అంటున్నారు.  ఇంకొందరైతే ఇలా సాంగ్ అని చెప్పి టీజర్ రిలీజ్ చేయడం ఏమి బాగాలేదని, బన్నీ అండ్ కో తమను చీట్ చేశారని అంటున్నారు.  ఏదైతేనేం యూనిట్ ఇలా టీజర్ ను రిలీజ్ చేయడంతో ఫ్యాన్స్ మొత్తం షాక్ అయ్యారని చెప్పాలి.  ఇకపోతే ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  


ఇక ఈ సినిమాలోని బుట్టబొమ్మ పూర్తి లిరికల్ వీడియోను డిసెంబర్ 24 వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు. మరి ఈ సాంగ్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే.  చూద్దాం ఎలా ఉంటుందో.  ఎన్ని అద్భుతాలు చేస్తారో... ఎలాంటి విజయాలు సాధిస్తారో...బన్నీ - త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: