సినిమా ఇండస్ట్రీలో చాలా చిన్న వయసులో అందంగా ఉన్నప్పటికి అవకాశాలు లేక అవకాశాలు ఎవరైనా ఇస్తారని ఎదురు చూసి ఎదురు చూసి ఆవేశం కట్టలు తెంచుకొని అందరి మీద అసహనం వ్యక్తం చేస్తూ హాట్ టాపిక్ గా మారుతున్న సంగతి తెలిసిందే. తెలుగు అమ్మాయిలు పనికిరారని అందుకే ముంబై నుండి మోడల్స్ ని తెచ్చుకుంటారని వాళ్ళైతే కమిట్‌మెంట్ ఇస్తారని అదే మేమైతే వాళ్ళు చెప్పినట్టు వినమని వాపోతున్నారు. అంతేకాదు ఎక్స్ఫోజింగ్ కూడా మేము చేయమన్న మాట చెప్పి తెలుగమ్మాయిలని తీసుకోటం లేదని టాలీవుడ్ మేకర్స్ మీద సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 

 

ఈ వ్యాఖలన్ని చేసింది ఎవరో కాదు అచ్చ తెలుగు అందమైన అమ్మాయి మాధవీ లత. చూడటానికి చాలా అందంగా ఉంటుంది. నటన అధ్బుతంగా చేస్తుంది. వచ్చిన రాని తెలుగు ని ఖూనీ చేసే ముంబై హీరోయిన్స్  కంటే చక్కని తెలుగు భాషని స్పష్ఠమైన ఉచ్చారణతో డైలాగ్స్ చెప్పే సత్తా ఉన్న మాధవీ లత మొదటి సినిమా నచ్చావులే సినిమాతో మంచి హిట్ ని అందుకుంది. ప్రయోగాలతో చిత్రాలని తెరకెక్కించే దర్శకుడు రవిబాబు దర్శకత్వంలో రామోజీరావు నిర్మించిన ఈ సినిమా సూపర్ హిట్ ని అందుకుంది.

 

ఆ తర్వాత నేచురల్ స్టార్ నాని తో స్నేహితుడా అనే సినిమాలోను నటించింది. కానీ ఆ సినిమా అనుకున్నంతగా సక్సస్ కాలేదు. ఆ తర్వాత మాధవీ లతకి అవకాశాలు అంతగా రాలేదు. ఆ తర్వాత మొత్తంగా తగ్గిపోయాయి. అయితే తనకి టాలెంట్ లేక అవకాశాలు రాలేదని ఒక దర్శకుడు తను అడిగింది చేయలేదనే నన్ను ఇండస్ట్రీలో తొక్కేశారని వాపోతోంది. అంతేకాదు నువ్వు ఇండస్ట్రీలో సినిమాలు ఎలా చేస్తావో చూస్తా అని అన్నాడట.

 

అయితే మాధవీ లత ని సదురు డైరెక్టర్ తన నుంచి ఆశించిది కుదరకపోవడంతో షుటింగ్ లో బాగా ఇబ్బంది పెట్టాడని ఫక్ అన్న పదం వాడి నీచంగా తిట్టాడని ఆ క్షణం లో మధ్యలో సినిమా ఒదిలి వెళ్ళి పోదామనుకున్నాని కాని సంస్కారం ఉంది కాబట్టే సినిమాని మధ్యలో వదిలి వెళ్ళకుండా కంప్లీట్ చేశానని కాని ఆ సంస్కారం ఆ డైరెక్ట్ కి లేదని తెలిపింది. ఇక ఛాన్స్ ఇస్తే ఇప్పటికీ హీరోయిన్ గా నటిస్తానని వెల్లడించింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: