అక్కినేని కోడలు సమంత భయపెట్టాలని చూస్తోందా.. ఎవరు పట్టించుకోకపోయినా సామ్ మాత్రం తెగ ఇష్టపడుతోంది. సమంత ఎందుకు ప్రతీసారి ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటోందని ఫిల్మ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అసలు సామ్ ప్లాన్ ఏంటి.. ఎందుకు ట్రాక్ ఛేంజ్ చేస్తోందో తెలుసా..?

 

గతేడాది సమంతకు అద్భుతంగా కలిసొచ్చింది. ఓ బేబి, మజిలీ లాంటి బ్లాక్ బస్టర్స్ తో సత్తా చాటింది. కానీ ఈ ఏడాది స్టార్టింగ్ లోనే అక్కినేని కోడలుకు షాక్ తగిలింది. జాను సినిమాతో మరోసారి ఆడియన్స్ జానుగా మారుతుందేమో అనుకుంటే నిరాశపరిచింది. అయితే ఇప్పుడు సమంత కొత్త ఆలోచనలు చేస్తోంది. వెబ్ సిరీస్ లు చేస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడు తెలుగుకు టాటా చెప్పినట్టే కనిపిస్తోంది. 

 

సమంత మరో హారర్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి షాక్ ఇచ్చింది. సామ్ సినిమాల్ని తగ్గించుకుంటుందన్న కామెంట్స్ కు చెక్ పెడుతూ కొత్త సినిమాకు కమిట్ అయ్యింది. హారర్, థ్రిల్లర్ జానర్స్ సమంతకు కలిసి రాకపోయినా.. మళ్లీ మళ్లీ అదే జోనర్స్ ట్రై చేస్తోంది. సామ్ లీడ్ రోల్ లోనటించిన యూటర్న్, రాజుగారి గది 2 ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. అయినా సామ్ మాత్రం మారలేదు. 

 

కొత్తగా సమంత రెండు సినిమాలకు కమిట్ అయ్యింది. విఘ్నేష్ శివన్ తెరకెక్కిస్తున్న ముక్కోణపు ప్రేమకథా చిత్రంతో పాటు అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో హారర్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రెండు కూడా తమిళ సినిమాలే కావడం విశేషం. సడన్ గా తెలుగు సినిమాలు తగ్గించి.. తమిళ సినిమాలపై ఫోకస్ చేయడం ఏంటనేది కాస్త ఆశ్చర్యంగా ఉంది. సమంతకు ఈ సారైనా హర్రర్ జానర్ కలిసొస్తుందేమో చూడాలి. అక్కినేని వారి కోడలు అయినా కూడా.. సమంత సినిమాల జోరు ఆగడం లేదు. కొత్త కొత్త సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మైమరిపిస్తోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: