కంగనా రనౌత్ కు బాలీవుడ్ లో ఎలాంటి పేరు ఉన్నదో చెప్పక్కర్లేదు.  ఆమె సినిమాలు అగ్రెసివ్ గా ఉంటాయి.  నటించే విధానం కూడా డిఫెరెంట్ గా ఉంటుంది.  కంగనా సినిమా అంటే వావ్ అనిపించే విధంగా ఉంటుంది.  అందుకే కంగనా చేసే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది. సినిమాలో ముఖ్యంగా  తన పాత్రకు ఎలాంటి ఇంపార్టెన్స్ ఉన్నది.  ఎలా నటిస్తే బాగుంటుంది.  ఆ పాత్ర వలన తన ఇమేజ్ కు దెబ్బ ఉంటుందా లేదా అనే విషయాలు చూసుకొని సినిమాలు చేస్తుంది.  


బాలీవుడ్ లో ఆమెకు క్వీన్ అనే పేరు ఉన్న సంగతి తెలిసిందే.  ఆమెతో సినిమా చేయాలి అంటే అన్ని దగ్గర పెట్టుకొని చేయాలి.  ఏమైనా తోక జాడిస్తే ఇక అంతే .  ఏమాత్రం ఒప్పుకోదు.  రెండు చెంపలు వాయించేస్తుంది.  ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆమె వదిలిపెట్టదు. ఎంతకైనా తెగించేందుకు సిద్ధం అవుతుంది.  అందుకే కంగనా అంటే ప్రతి ఒక్కరు భయపడిపోతుంటారు. ఇప్పుడు కంగనా ఈ విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంది.

 
ప్రస్తుతం కంగనా కోలీవుడ్ లో తలైవి సినిమా చేస్తున్నది. అమ్మ జయలలిత పాత్రలో ఆమె నటిస్తున్న సంగతి తెలిసిందే.  జయలలిత యంగ్ గా ఉన్నప్పటి నుంచి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాక జరిగిన విషయాలను సినిమాలో చూపించబోతున్నారు.  జయలలిత సినిమాల్లో ఉన్న సమయంలో సన్నగా ఉన్న సంగతి తెలిసిందే.  ఎప్పుడైతే జయలలిత రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యిందో అప్పటి నుంచే మారిపోయింది. జయలిత లావుగా మారిపోయింది.  


ప్రజా సమస్యలపైనే ఎక్కువ దృష్టి పెట్టింది.  అందుకే ఆమె మిగతా విషయాల గురించి పట్టించుకోలేదు.  కాగా, ఇప్పుడు జయలలిత పాత్రలో నటిస్తున్న కంగనా కూడా కథకు తగ్గట్టుగా మారిపోయిందట.  ఈ సినిమాలో జయలలిత రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తరువాత లావుగా మారింది కాబట్టి కంగనా ఏకంగా 20 కేజీల బరువు పెరిగి లావుగా మారిపోయింది.  ఆమెను సడెన్ గా చూస్తే ఎవరైనా సరే ఈమె ఎవరు అని అడిగేస్తారు.  అలా మారిపోయింది.  మీరు ఓ లుక్కెయ్యండి.  

మరింత సమాచారం తెలుసుకోండి: